jsdm వార్తకు స్పందన – ఎట్టకేలకు పాఠశాలలో నీరు బయటకు..

బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వర్షాల వలన నీరు చేరి బయటకు వెళ్లేందుకు దారి లేక మోకాలు లోతు నీటిలో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘చెరువును తలపిస్తున్న బోద్ధి కూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం’ శీర్షికన jsdm లో కథనం ప్రచురితమైనది. స్పందించిన అధికారులు, పంచాయితీ సర్పంచి, ఉప సర్పంచి గ్రామ పెద్దలు ఎట్టకేలకు పాఠశాలలోని నీరు బయటకు పంపెందుకు ఆదివారం ఉపక్రమించారు. ప్రొక్లయిన్ ఏర్పాటు చేసి గోడ ప్రక్కన కాలువ తీసి నీటిని బయటక పంపారు. దీంతో నీరు బయటక వెళ్లే అవకాశం ఏర్పడినది. పాఠశాల ఆవరణలో కూడ మెరక తోలి మరింత సౌకర్యవంతంగా చెయ్యాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ముందుగా స్పందించిన ప్రజా ప్రతినిథిలు సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, పీఎంసీ చైర్మన్ ఎదులూరి వెంకట రామి రెడ్డి, గ్రామ పెద్దలు పోలం రెడ్డి రమణా రెడ్డి, సుబ్బా రెడ్డి, పులి రామి రెడ్డి, గంగి రెడ్డి శ్రీనివాస రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *