ఇద్దరు పిల్లలతో సహా ఇల్లు వదిలి వెళ్ళన వివాహిత మహిళ తిరిగి ఇంటికి చేర లేదంటూ ఆమె భర్త బేగంపేట పోలీస్ లకు పిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసు ల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి.బేగంపేట రసూల్ పుర ఇందిరమ్మ నగర్ లో బి.నాగరాజు నిఖితలు నివసిస్తున్నారు.నాగరాజు ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు.2019లో నాగరాజు తో నిఖిత కు వివాహమైంది.వీరికి అఖిల్(5), దేవాన్ష్ (3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 14వ తేదీన ఇంటినుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని నిఖిత బయటకు వెళ్లి తిరిగి రాలేదని.ఆమె కోసం తెలిసిన అన్ని చోట్ల గాలించినా ఆచూకీ తెలియక పోవడం తో ఆదివారం మధ్యాహ్నం నిఖిత భర్త నాగరాజు బేగంపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు ఎస్సైటి.శ్రీధర్ తెలియజేశారు.నిఖిత (24)వయసు 5.2అడుగుల ఎత్తు వుంటుందని,తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలు మాట్లాడుతుందని,ఇంటి నుంచి వెళ్లి పోయిన సమయం లో ఆమె క్రీం కలర్ టాప్,తెలుపు రంగు లెగ్గిన్ వేసుకుందని.ఆమె ,పిల్లల ఆచూకీ తెలిసిన వారు బేగంపేట పోలీస్ స్టేషన్ లో గాని డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని ఎస్సై శ్రీధర్ తెలియజేశారు.
