ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, బాధ్యతతో వ్యవహరించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, బాధ్యతతో వ్యవహరించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార పురోగతి, వివిధ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులు, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనుల పురోగతి, జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిపై క్షేత్రస్థాయిలో ఎంపిడిఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, ఏపీడీ, ఏపీవో, డీఈ, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగవంతంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ అంశాలపై ఎక్కువ శాతంలో అర్జీలు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా రెవిన్యూ, మరియు భూ సర్వే సమస్యలపై అర్జీలు ప్రజల నుండి వస్తున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ అన్నారు. పరిష్కరించలేని సమస్యలను అర్జీలకు రాతపూర్వకంగా ఎండార్స్మెంట్ రూపంలో తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా రీ ఓపెన్ కేసులపై రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, డివిజనల్ అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ లో వున్న కోర్టు కేసులపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, జిల్లాలోని వివిధ శాఖలలో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి పరిష్కారానికి ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి టైమ్ బాండ్ కేసులు, డైరెక్షన్స్, ధిక్కార, రిట్ ఫిటీషన్స్ లపై ఆయా శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. రిట్ పిటీషన్లపై సరైన కౌంటర్లు ఫైల్ చేయాలన్నారు. ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల పరిష్కారంపై వారం వారం సమీక్షిస్తామన్నారు. లోకాయుక్త కేసులపై జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు తో సమగ్రంగా కలెక్టర్ సమీక్షించారు. సంబంధిత కేసులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. రిట్ పీటీషన్స్ లో కోర్టు లు ఇచ్చిన ఆదేశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణ నమోదు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు ముందుగానే తీసుకున్న చర్యలపై నివేదికను సదరు కోర్టు కు సమర్పించాలన్నారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో ఎటువంటి జాప్యం లేకుండా వకాల్తా సమర్పించాలన్నారు.

జిల్లా కలెక్టర్ పెన్షన్స్ పంపిణీ గురించి సమీక్షిస్తూ, 31వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించిన నగదును ఈ నెల 30వ తేదీనే ముందస్తుగానే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలన్నారు. ఒకటో తేదీన ఉదయం ఐదు గంటలకి లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది పింఛన్ నగదు పంపిణీ చేయాలన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎంపిడిఓ లను ఆదేశించారు.

జిల్లాలో ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాలు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, ఫారంపాండ్ నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. జిల్లా లో 33 వేల ఇంకుడు గుంతల నిర్మాణాలు, 7,200 ఫారంపాండ్ నిర్మాణాలు, 1,056 రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి లక్ష్యం మేరకు యూనిట్స్ ను అనుమతులు తీసుకోవడం, తీసుకున్న అనుమతులకు సంబంధించి యూనిట్స్ ను గ్రౌండింగ్ చేయడం, గ్రౌండింగ్ చేసిన యూనిట్స్ ను పూర్తీ చేయడం చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. ప్రతి గ్రామంలో పల్లెవనం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా 25 సెంట్స్ నుండి ఒక ఎకరా ప్రభుత్వ స్థలం ను గుర్తించి మండలానికి ఒక ప్రతిపాదన పంపాలని ఆదేశించగా ఇప్పటి వరకు 15 మండలాల నుండి ప్రతిపాదనలు రావడం జరిగిందని, మిగిలిన మండలాల అధికారులు కూడా ప్రతి పాదనలు పంపాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు.

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి రానున్న మార్చి నాటికి ఇంటి నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఇంటి పనులు ప్రారంభించిన ప్రతిచోట తప్పనిసరిగా మార్చి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి స్టేజ్ కన్వర్షన్ జరిగేలా చూడాలన్నారు.

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ లోకేశ్వర రావు, డ్వామా పిడి జోసఫ్ కుమార్, పిడి హౌసింగ్ శ్రీనివాస రావు, సిపిఓ వేంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్, సాంఘీక సంక్షేమ శాఖ డి డి శ్రీ లక్ష్మా నాయక్, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి అంజల తదితరులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఎంపి డి ఓ లు, తహసీల్దార్లు, సంబంధింత శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *