తాళ్లూరు మండలంలో 91శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు ఎంపీడీఓ సుందర రామయ్య తెలిపారు. మండలంలో 6224 మందికి గాను 5700 మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. తాళ్లూరు, నాగంబొట్ల పాలెం, తూర్పుగంగవరంలలో పింఛన్ల పంపిణీ తీరును ఆయన పరిశీలించారు. తాళ్లూరులో ఎంపీడీఓ, టిడిపి నాయకుడు ఐ శ్రీనివాస రెడ్డి, గ్రామకార్యదర్శి ఐ రమణా రెడ్డి పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు. ఆయా పంచాయితీలలో గ్రామ నాయకులు, అధికారులు పాల్గొని పెన్షన్లను పండుగలా పంపిణీ చేసారు.
