నవంబర్ 10న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత డీఎస్సీ శిక్షణకు ఎంపికయిన అభ్యర్థులకు స్కీనింగ్ టెస్ట్ ఉంటుందని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి ఎన్ లక్ష్మా నాయక్ తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ ద్వారా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో 5050 మందికి ఉచిత శిక్షణ, హాస్టల్ వసతితో ఇవ్వటానికి నిర్ణయించినట్లు చెప్పారు. అందుకు దరఖాస్తు చేసుకుని అన్ని అర్హతలతో ఎంపికయిన అభ్యర్థుల మొబైల్ నెంబర్లకు అందుకు సంబంధించిన సమాచారం వస్తుందని చెప్పారు. కావున దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా నవంబర్ 10న స్కీనింగ్ టెస్ట్‌కు హాజరు కావాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

