హామీలను అమలుచేస్తున్న కూటమి ప్రభుత్వం – టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలను తప్పకుండా అమ లుచేస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శి ఆర్ అండ్ బీ అతిథి గృహ ఆవరణలో శుక్రవారం సాయంత్రం లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిం డర్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వృద్ధులకు, వితంతువులకు ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. తాజాగా మహిళలకు ఇచ్చిన హమీ మేరకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని ప్రారం భించటం ఆనందదాయకమన్నారు. త్వరలో మహిళల కు ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించటం తో మిగిలిన హమీలను కూడా అమలుచేయటం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ర ష్ర్టంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను గతంలో ఎన్నడూలేని విధంగా అమలుచేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని స్థితిలో విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
అంతకముందు దర్శిలో పింఛన్ ల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. అవ్వతాతలు పింఛన్లు తీసుకునే సమయంలో వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. అందరికీ ఒకేరోజు పూర్తిగా పింఛన్లు పంపిణీ చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమాల్లో దర్శి తహసీల్దార్
ఎం.శ్రావణ్ కుమార్ , ఎంపీడీవో కృష్ణమూర్తి, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కమిషనర్ వై.మహేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

దర్శి కనకదుర్గమ్మ ఆలయంలో మాలలు ధరించిన స్వాములకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్
దంపతులు శుక్రవారం అన్నదానం చేశారు. దర్శి ప్రాంతంలో అయ్యప్పస్వామి, వెంకటేశ్వరస్వామి, భవానీ, శివమాలలు ధరించిన స్వాములు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నా రు. అంతకముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందుకున్నారు. కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *