సాధారణంగా వృద్ధాప్యం వస్తే ముఖం మీద చర్మం ముడతలు పడడం లాంటివి ఉంటాయి. శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా ఉన్నా.. ఇలాంటివి మాత్రం మనుషుల ఆత్మస్థైర్యాన్ని కాస్త దెబ్బతీస్తాయి. వీటిని జయించేందుకు ఆధునిక వైద్యం తోడ్పడుతుందని సీనియర్ డెర్మటాలజిస్టులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించిన “అప్‌డేట్ ఇన్ ప్రొసీజరల్ డెర్మటాలజీ” సదస్సులో పలువురు వైద్యులు పాల్గొని, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 300 మంది డెర్మటాలజిస్టులకు పలు విషయాలు తెలిపారు. ముందుగా ఈ సదస్సును కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ సంబిత్ సాహు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతరం నేర్చుకోవడం అనేది వైద్యవృత్తిలో చాలా కీలకమని, డెర్మటాలజిస్టులు ఈ దిశగా వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనీరియాలజిస్ట్స్, అండ్ లెప్రాలజిస్ట్స్ (ఐఈడీవీఎల్) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ డెర్మటాలజిస్టు డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు ఈ సదస్సుకు నిర్వాహకులుగా వ్యవహరించారు మరియు డా. ఏకె. లహరి ఈ సదస్సుకు సైటింఫిక్ కన్వీనర్ గా వ్యవహరించారు. ఇందులో ప్రధానంగా వృద్ధాప్యాన్ని జయించేందుకు ఉన్న వివిధ రకాల పద్ధతులు, మూలకణ చికిత్సలు, గోళ్లలో వచ్చే ఇన్ఫెక్షన్లు, మచ్చల నివారణకు వస్తున్న ఆధునిక చికిత్సలు లాంటి అంశాలపై లోతుగా చర్చించారు. మూలకణ చికిత్సలు చాలా విప్లవాత్మక ఫలితాలను ఇస్తున్నాయని, వీటి గురించి డెర్మటాలజిస్టులు మరింత పరిశోధనలు చేయాలని సూచించారు. వివిధ ప్రమాదాల్లో బాధితులకు ఆ తర్వాత ఏర్పడే మచ్చలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయని, వీటిని నయం చేయడానికి వచ్చిన ఆధునిక పద్ధతులను అందరూ తెలుసుకోవాలని సీనియర్ డెర్మటాలజిస్టులు చెప్పారు. ఐఏడీవీఎల్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవీడీఎస్ ప్రసాద్, ఐఏడీవీఎల్ కోశాధికారి డా. షహాన, సీనియర్ డెర్మటాలజిస్టులు డాక్టర్ డాక్టర్ ఎన్. రమేష్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుధావాణి, డాక్టర్ సాయికృష్ణ, డా. ఉషా, డా. సమత, డా. రెహమాన్, డా. ఇమ్రాన్ అలీ, డా. రాజ్ కిరిట్, డా. నజియా, డా. రేఖా సింగ్, డా. నిషిత, డా. శృతి, డా. సుప్రజ, డా. రాకేష్ కుమార్, డా. అసియా బేగం, జాతీయ ఐఎడివిఎల్ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ భూమేష్ కుమార్, జాతీయ ఐఎడివిఎల్ కోశాధికారి డాక్టర్ ఎస్ బి కవిత పాల్గొని, వివిధ అంశాలపై లోతుగా వివరించారు. ఢిల్లీకి చెందిన సీనియర్ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మానస్ ఛటర్జీ ప్రసంగించారు.

