నీటి గల్లంతు ప్రమాదాలను నివారించండి ప్రజలలో చైతన్యం కలిగించండి – దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

నీటి గల్లంతు ప్రమాదాలను నివారించండి ప్రజలలో చైతన్యం కలిగించాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు . దర్శి నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా కాలవల్లో, చెరువుల్లో యువకుల గల్లంతు అవటం తనకెంతో ఆవేదన కలిగిస్తుందని అన్నారు. దర్శి మండలం చింతలపాలెం చెరువులో సోమవారం పట్టణానికి చెందిన హరిజన వారి పాలెం యువకుడు గల్లంతవ్వడం జరిగిందన్నారు . గతంలో కూడా దర్శి పట్టణంలో కురిచేడు రోడ్ లో ఉన్న సాగర్ కాలువలో, భీమవరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా మరియు ఈతకు వెళ్లిన యువకులు గల్లంతవడం మనకు ఎంతో బాధ కలిగించిందన్నారు . ఇప్పటికైనా పోలీస్ శాఖ అప్రమత్తమై తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు . దర్శి నియోజకవర్గం లోని సీఐలకు, ఎస్ఐలను ఆమె సూచించారు . దర్శి పట్టణం మరియు గ్రామాలలో ఉన్న కాలువలు చెరువులు, వాగులు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న వీఆర్వోలకు, వివో లకు సచివాలయ సిబ్బందికి ఈ మేరకు సూచనలు ఇవ్వాలని.. గ్రామ పోలీసుల ద్వారా ప్రమాదాలను నివారించాలని ఆమె సూచించారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు . అవసరమైతే స్వచ్ఛంద సేవ సంస్థల సహకారాన్ని కూడా తీసుకొని .. దర్శి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోలీస్ శాఖకు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *