ఎల్ఐసి ఏవోఐ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన నెల్లూరు డివిజన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఎల్ఐసి ఆల్ ఇండియా ఏజెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షుడు ఆర్ రామకోటి రెడ్డి కోరారు . దర్శి ఎల్ఐసి కార్యాలయం వద్ద సోమవారం ఎల్ఐసి ఏ ఓ ఐఆధ్వర్యంలో నెల్లూరు డివిజన్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు , ఈ సందర్భంగా ఆర్ రామకోటిరెడ్డి మాట్లాడుతూ .. పాత విధానాన్ని కొనసాగించి ఏజెంట్లు కమిషన్ పెంచాలని జీఎస్టీ రద్దు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజెంట్లకు 50 లక్షలకు పెంచాలని , 10 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన ప్రతి ఏజెంట్ ను లైఫ్ మెంబర్ గా పరిగణించాలని , పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెంట్ల కమిషన్ పెంచాలనారు… క్లాబ్యక్ ఆఫ్ ఆఫ్ కమిషన్ నిబంధన రద్దు గురించి సర్కులర్ రూపంలో అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు . అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఐ ఆర్డి ఏ ని అడ్డుపెట్టుకొని ఎల్ఐసి లో తీసుకు ని వస్తున్న హానికరమైన మార్పు వ్యతిరేకిస్తూ .. దేశవ్యాప్తంగా అన్ని డివిజనల్ ఆఫీసులో వద్ద ధర్నాలు నిర్వహించాలని ఆలిండియా పిలుపుమేరకు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో అద్దంకి బ్రాంచి గౌరవాధ్యక్షుడు బోడపాటి హనుమంతరావు , బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె కాలే భాష , సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు , అభివృద్ధి అధికారి అమ్రూ నాయక్ ఏజెంట్లు పాల్గొన్నారు .
