పలు చోరీ కేసుల్లో నిందితులు అరెస్టురూ.23,18,900 విలువైన సొత్తు స్వాధీనం -వివరాలు వెల్లడించిన ఎస్పి దామోదర్

గంజాయి, చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద రూ. 23,18,900 సొత్తును -స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి ఎఆర్ దామోదర్ తెలిపారు. – జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పి ఏ ఆర్ దామోదర్ వివరాల వెల్లడించారు. – ఒడిస్సా రాష్ట్రం, నూపాడ జిల్లా, ధోబిపడ మండలం జాంక్కు చెందిన మహేది హుస్సేన్, ప్రకాశం జిల్లా ఒంగోలు విజయనగర్ కాలనీ చెందిన షేక్ కపాఠావు, తాళ్లూరు మండలం రామభద్రాపురం గ్రామానికి చెందిన వడిశన వేణుగోపాల్ రెడ్డి, చీమకుర్తిలోని వైఎస్. కాలనీకి చెందిన షేక్ తరుణ్, యర్రగొండపాలెం మండలం ఎస్ఈ కాలనీకి చెందిన ఆవుల బ్రహ్మయ్య లు ముఠాగా ఏర్పడి గంజాయి, చోరీలకు పాల్ప డుతున్నట్లు ఎసి.పి వివరించారు. ఈ ముఠా కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పొదిలిలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో దర్శి డిఎస్పి బి.లక్ష్మీ నారాయణ సారధ్యంలో స్థానిక సిఐ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ వేమన తమ సిబ్బందితో కలిసి ఈ ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 1,350 కిలోల గంజాయి. 303-గ్రాముల బంగారము, బైకు, రూ.6700 నగదు కలిపి మొత్తం రూ.23,18,900 సొత్తును స్వాధీనం. చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ చూపిన దర్శి డిఎస్ పి బి. లక్ష్మి నారాయణ, పొదిలి సిఐ టి- వెంకటేశ్వర్లు, ఎస్ఐ వి. వేమన, హెడ్ కానిస్టేబుల్ కె.పూర్ణచంద్ర రావు, షాకీర్, ఎస్.శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది. గౌతమ్ కుమార్, కోటేశ్వరరావు, వీరాజు, బాల మురళిని ఎస్పి దామోదర్ ప్రత్యేకంగా… అభినందించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు. రివార్డ్స్ ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *