ముండ్లమూరు మండలంలోని శంకరాపురంలో ఒక బెల్టు షాపులో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు బుధవారం దర్శి ఎక్సైజ్ సీఐ కే శ్రీనివాసరావుకు సమాచారం అందింది. దీంతో తన సిబ్బందితో వెళ్లి బెల్టు షాపుపై దాడి చేయగా 15 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ శ్రీనివాసరావు చెప్పారు. నిర్వాహకుడు ఎడ్లూరి మనోజ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలి పారు. ఈ దాడుల్లో సిబ్బంది శ్రీనివాసులు, ఎన్ శ్రీనివాసరావు, పీ నాగ రాజు, కాశం పీర ఉన్నారు.
