గొట్టిపాటి, కడియాల జన్మదిన దినోత్సవం సందర్భంగా ట్రై సైకిళ్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ప్రముఖ టిడిపి నాయకులు, నరసరావుపేట పట్టణ టిడిపి అధ్యక్షులు, మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్, కడియాల రమేష్ జన్మదినోత్సవం సందర్బంగా విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో కేక్ కట్ చేసి… తదుపరి నలుగురు దివ్యాంగులకు 4 ట్రై సైకిల్ల ను దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , కడియాల రమేష్ చేతుల మీదుగా దర్శి లోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నివాసం నందు ఉచితంగా అంద చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ ట్రై సైకిల్లను గొట్టిపాటి భరత్ ఎలక్షన్స్ లో విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన హామీమేరకు అస్సిట్ సంస్థ సహకారం తో ఈరోజు ముండ్లమూరు మండలం లోని దాసరి లతానీయులు (పసుపుగళ్ళు- చింతలపూడి), రావి కోటేశ్వరరావు ( శంకరాపురం), మరియు తాళ్లూరు మండలాలోని బొజ్జ యోనేష్ (నాగంబొట్ల పాలెం ), బొజ్జ నరసయ్య (నాగంబొట్ల పాలెం ) 4గురికి అందజేసారు.
కార్యక్రమంలో నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *