నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారని ముందుగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఒత్తిడిని జయించాలని అందుకు అనుగుణంగా వ్యాయామం, యోగ వంటి తో పాటు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని,
ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి .శంకర రాజు అన్నారు. ఆదివారం బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శర్మాస్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో కొలెస్ట్రాల్ అధిక బరువు మజిల్ పలు రకమైన పరీక్షలను నిర్వహించారు నేటి సమాజంలో చిన్న వయసు తెలిపిన వారే అధిక ఒత్తిడికి గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని నిద్రలేక పలు రకాలు పడుతున్నారని అలా కాకుండా ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని వాక్యం జాగింగ్ లతో పాటు స్విమ్మింగ్ యోగ వంటి వాటితో ఉపశమనం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కలు సుభాష్ ముదిరాజ్ ఆలయానికి వచ్చిన భక్తులు సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు కార్యక్రమంలో వెల్నెస్ సెంటర్ సిబ్బంది జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

