అసెంబ్లీ వద్దు… మీడియానే ముద్దుజగన్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంపై విమర్శలు – ఎన్నుకున్న ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు -పాలకుల వైఫల్యాలను అసెంబ్లీలో నిలదీసేదెవరు నాలుగున్నరేళ్లు సమావేశాలు చప్పచప్పగా సాగడమేనా?

అసెంబ్లీ సమావేశాల వేళ..అసెంబ్లీలఅధినేత వైస్ జగన్ సభను బహిష్కరించాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
పాలకుల వైఫల్యాలను అసెంబ్లీలో -నిలదీసేది ఎవరు?… ఈ నాలుగున్నరేళ్లుసభ ఇలాగే కొనసాగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ను అనేక కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.
ఈ తరుణంలో రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినప్పటికీ 40 శాతం వరకూ ఓటింగ్ నమోదయింది. ఈ క్రమంలో తన పార్టీని ఆదరించిన ఆ 40 శాతం మంది ఓటర్లకోసమైనా పాలకులు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయ డంతో పాటు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాలి. చట్టాల రూపకల్పనలో విలువైన సూచనలు చేయాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. చట్ట సభలో ప్రతిపక్షం ఉంటేనే ఏఅంశం పైన అయినా అర్ధవంతమైన ! చర్చ జరుగుతుంది. అయితే సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం (మైక్) ఇవ్వరని, అందుకే సమావేశాలకు వెళ్లి ఉపయోగం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ చెబుతున్నారు. అసెంబ్లీసమావేశాలు జరిగినన్ని రోజులూ
మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ అంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ మీడియా సమావేశాలకు దూరంగా ఉన్న జగన్… ఎన్నికల్లో వైసీపీ ఘోరఓటమి తర్వాత దాదాపు డజనుకు పైగా మీడియా సమావేశాలు నిర్వహించారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా జగన్ పైతీవ్ర స్థాయిలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. శాసనసభా సంప్రదాయాల ప్రకారం ప్రతి ఎమ్మెల్యేకి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం వినిపించే అధికారం, హక్కు ఉంటాయి. పూర్తి స్థాయిలో నాలుగున్నరేళ్లు అసెంబ్లీకి దూరంగా ఉండాలనిఎన్నికలు అయిన ఆరు నెలల్లోనే ఇలాఅసెంబ్లీ వద్దు… మీడియానే ముద్దునిర్ణయించుకున్న రాజకీయ పార్టీ దేశ చరిత్ర లో ఏదీ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు తనకు అసెంబ్లీలో అవమానం జరిగిందంటూ… ఇది గౌరవ సభ కాదు… కౌరవ సభ అని అభివర్ణిస్తూ మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను, లేకపోతే దూరంగా ఉంటానని శపథం చేసి బయటకు వచ్చారు. అయితే చంద్రబాబు ఒక్కరు మాత్రమే. సమావేశాలకు దూరంగా ఉన్నారు తప్ప మిగిలిన టీడీపీ సభ్యులు
హాజరయ్యారు. కానీ జగన్ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం ఇది కొత్తేమీ కాదు. 2014 నుంచి 2019 వరకూ వైసీపీప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో చివరి ఏడాదిలో ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా, ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయనందుకు నిరసనగా, నాటి అధికార టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ వైఎస్ జగన్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నారు.
అది చివరి ఏడాది కావడం, ఒకటి రెండు సమావేశాలకు గైర్హాజరు అయినా పెద్దగా పట్టించుకోలేదు.నాటి టీడీపీ వైఖరిని ఎండగడుతూ
పాదయాత్ర ద్వారా జగన్ జనాల్లోకివెళ్లారు. ఇప్పుడు ఇంకా నాలుగున్నర సంవత్సరాల పాలనా గడువు ఉన్న తరుణంలో జగన్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం సరైనదేనా అనే చర్చ ప్రజల్లోనూ జరుగుతోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఎన్నుకున్న ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు?. పాలకుల వైఫల్యాలను అసెంబ్లీలో నిలదీసేదెవరు?, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే లేకపోతే ఆ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో జరిగే అసెంబ్లీ సమావేశాలు చప్పచప్పగా సాగడమే అవుతుంది. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందున తాను బహిష్కరిస్తున్నా… మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళతారు, ప్రభుత్వాన్ని వివిధ అంశాల్లో నిలదీస్తారు అని ప్రకటించి ఉంటేకొంత వరకూ బాగుండేదన్న అన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వాస్తవానికి ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ఏకైక వేదిక అసెంబ్లీ. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు బయట మీడియాముందు ఎన్ని మాట్లాడినా అవి రికార్డుగా ఉండవు. అసెంబ్లీలోప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి
మాట్లాడినా అవి రికార్డుల్లో ఉంటాయి.
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్
హామీలను ఎందుకు నెరవేర్చడం ?లేదని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు పితగ్గింపు అంశం, విద్యుత్ ట్రూఆప్చార్జీల సమస్య ఇలా అనేక ప్రధాన
అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికిప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీ సరైన వేదిక. అటువంటి వేదికకు వైసీపీ దూరంగా
ఉండాలని నిర్ణయించుకుంది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలనివైసీపీ నిర్ణయం తీసుకోవడాన్ని పీసీసీ
అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగాతప్పుపట్టారు. సమావేశాలకు
వెళ్లకపోతే వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేపదవికి రాజీనామా చేయాలని
డిమాండ్ చేశారు.అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేనివారికి ఎమ్మెల్యే పదవులు ఎందుకు అంటూఆమె నిలదీశారు. ఎమ్మెల్యే హోదాలో
అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్నిప్రశ్నించాల్సిన జగన్… అసెంబ్లీ
సమావేశాలను బహిష్కరించడం సరైన -నిర్ణయం కాదని అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనపై ఉంచిన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంలో పునరాలోచన చేస్తే బాగుంటుంది. జగన్ సాంకేతికంగా ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా నైతికంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడే. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *