నవంబరు 9,10 తేదీలలో తిరుపతి లో జరిగిన 1st ఓపెన్ సౌత్ ఇండియా ఛాంపియన్‌షిప్ -2024 లో ఏపీ పోలీస్ శాఖ నుండి కరాటే పోటీలో పాల్గొని బంగారం పతాకం సాధించిన కానిస్టేబుల్ పి.కరీముల్లా (ARPC- 2823)ను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ….ఒకవైపు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే మరో పక్క కరాటే పట్ల ఉన్న మక్కువతో అసాధారణ సాధన చేస్తూ జాతీయస్థాయిలో అద్వీతీయమైన ప్రదర్శన కనబర్చి గోల్డ్ మెడల్ సాధించడం చాలా గొప్ప విషయన్నారు. ప్రకాశం జిల్లా నుండి జాతీయ స్థాయిలో పతకం సాధించడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని, అలాగే భవిష్యత్తు పోటీలకు కూడా సంసిద్దమై సత్తా చాటి రాష్ట్ర పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, సీతారామిరెడ్డి పాల్గొన్నారు.


