మార్గశీర్ష మాసం, శుక్లపక్ష ఏకాదశి, డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ, హిందూ ధర్మిక సంస్థ, ఒంగోలు వారి ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీ నిర్వహిస్తున్నాము.
భగవద్గీత లోని 12వ అధ్యాయం “భక్తియోగం” లోని 20 శ్లోకాలు నేర్చుకొని చూడకుండా వీడియో రికార్డు చేసి 9492180492 కు పంపడమే పోటీకి అర్హత… అని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు.
ఈ సందర్భముగా మాట్లాడుతూ అద్భుత ఆధ్యాత్మిక గ్రంథం, మానవ జీవన మనుగడకు దిక్సూచి, భగవద్గీత ను శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన రోజు ను గీతా జయంతిగా జరుపుకుంటాం. ఈరోజును మోక్షద ఏకాదశి అని కూడా నానుడిగా తెలిపారు. పోటీ వివరాలు తెలుపుచూ… 1 నుండి 15 సం. వరకు వయసుగల చిన్నారులు ఒక విభాగముగా, 15 నుండి 25 సం. వరకుగల యువతి యువకులు ఒక విభాగముగా, 25 సం. వయసు పైగల వారు మరో విభాగముగా నిర్ణయించడమైనదని, శ్రీవారి ఆశీస్సులతో… ప్రతి విభాగములో తొలి ముగ్గురికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, తరువాతి స్థానాల్లోని మరో ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందన పత్రం ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
– సరైన వెలుతురులో ఫోన్ అడ్డంగా ఉంచి వీడియో తీయాలి,
– శ్లోకాల పఠన ఉచ్ఛారణ స్పష్టంగాఉండాలి,
– పోటీలో పాల్గొనే వారు సంప్రదాయ వస్త్రధారణ తో ఉండాలి,
– న్యాయనిర్ణేతలు నిర్ణయించిన ప్రకారం బహుమతులు అందించడం జరుగుతుంది. జడ్జిమెంట్ పై ప్రశ్నోత్తరాలకు తావులేదు.
– డిసెంబరు 4న విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతుంది.
– విజేతలకు, పోటీలో పాల్గొన్న అందరికీ డిసెంబరు 6వ తేది శ్రీగిరి గిరి ప్రదక్షిణ అనంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణమున బహుమతులు అందించడం జరుగుతుంది.
– పోటీదారులు తమ వీడియోలను పంపవలసిన చివరి తేది 30 నవంబరు 2024.
– విడియోలు పంపవలసిన, వివరాలకై సంప్రదించవలసిన ఫోన్ నంబరు 9492180492 గా తెలిపారు.
ఈ మేరకు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయములో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, కార్యదర్శి త్రిపురం మల్లిఖార్జునరావు, సభ్యులు ధనిశెట్టి రామునాయుడు, తదితరులు గోడ పత్రాలను ఆవిష్కరించారు.
