ఘనంగా జాతీయ బాలల దినోత్సవం- మహాత్మాగాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుక.

బాలల్లార రారండి…
బారులు తీరి రారండి…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బాలల పండుగ వచ్చింది-
ఆడుతు పాడుతు రారండి…

చాచా నెహ్రూ పుట్టినరోజు-
బాలలందరికి పండుగ రోజా…

ఆపిల్ నీకు, చాక్లెట్ నీకు-
బత్తాయి నీకు, బిస్కెట్ నీకు…

ప్రథమ ప్రధాని నెహ్రూ నంట-
భారతీయతకు భద్రత అంట…

ఇందిర గాంధికి నాన్నంట-
ఇండియా ప్రజలకు చాచా నెహ్రూ…

ఆట పాటలతో పాటుగ విద్య
విద్యతో పాటుగ విజ్ఞానం
విజ్ఞానంతో పాటుగ సంస్కారం
నేర్వాలి. అంటూ వాసవిక్లబ్స్ పూర్వ జోన్ ఛైర్మన్ రాధా రమణ గుప్తా జంధ్యం గేయం పాడుచుండగా పిల్లలు ఉత్సాహంగా పలు గీతాలకు నృత్యం చేశారు. స్థానిక ఏనుగుచెట్టు వీధిలోగల మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో స్కూల్ కరస్పాండెంట్ మద్దాలి లక్ష్మీ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాతీయ బాలల దినొత్సవమును పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రంధి చెంచు రామారావు, ట్రినిటి హైస్కూల్ కరస్పాండెంట్ కొప్పోలు సురేష్ విచ్చేసి బాలల దినోత్సవము ప్రాముఖ్యతను వివరించారు. విద్యతో పాటు సంస్కారాన్ని చిన్న వయసు నుండే విద్యార్ధులకు నేర్పుచున్న మహాత్మాగాంధీ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ముందుగా భారత తొలి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.
కార్యక్రమంలో స్కూల్లో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో చిన్నారులు వెంకటేశ్వర స్వామి, పూబాల, దేవకన్య, సూపర్ మాన్, బాట్ మాన్, హంక్, పురోహిత తదితర వేషధారణలతో అలరించారు.

కార్యక్రమంలో వాసవి క్లబ్, ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రి నారాయణ, రాజ్యలక్ష్మీ దంపతులు, గార్లపాటి బ్రహ్మానందం, నేరెళ్ల శ్రీనివాసరావు, రాధా రమణ గుప్తా జంధ్యం, దర్శి మనోహర్ చంద్రశేఖర్, పబ్బిశెట్టి గోవర్ధన్, మద్దు అరవింద లక్ష్మి, చీదెళ్ల వేంకట ప్రసాదు, భూమా శ్రీనివాసులు, మరియు స్కూల్ టీచర్లు అయినాల కళ్యాణి, రేవతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *