రోడ్డు భద్రతపై జె .బి.ఎస్. ఆర్.టి.సి. డ్రైవర్లకు అవగాహన -ఆర్.టి.సి డ్రైవర్లు మిగతా ప్రైవేట్ డ్రైవర్లకు ఆదర్శంగా ఉండాలి – నార్త్ జోన్ , ఏ.సి.పి., జి.శంకర్రాజు

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని నార్త్ జోన్, ట్రాఫిక్ ఏ.సి.పి., జి శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమీషనర్ శ్రీ. సి.వి. ఆనంద్ మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి శ్రీ. విశ్వ ప్రసాద్, రాహుల్ హెగ్డే డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్-1, నార్త్ డిస్ట్రిక్ట్ ల ఆదేశాల మేరకు శుక్రవారం నాడు జె .బి.ఎస్ లో చెంగిచెర్ల డిపోకు చెందిన (50) మంది ఆర్.టి.సి. డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్.టి.సి. బస్సులో ప్రయాణం అంటేనే సురక్షిత ప్రయాణం అని అన్నారు. ఒక బస్సు లో సుమారు 40 నుండి 50 మంది ప్రయాణికుల ప్రాణాలు ఒక డ్రైవర్ చేతిలోనే ఉంటాయి, కాబట్టి డ్రైవర్ ఎల్లప్పుడూ జాగ్రత్తగా బస్సును నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి అన్నారు. ఈ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో శ్రీ జి శంకర్ రాజు – ఏ.సి.పి., నార్త్ జోన్, ట్రాఫిక్ తో పాటు ఆర్.టి.సి కి చెందిన శ్రీ ఖుస్రూ షా ఖాన్, సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్, కవిత, చెంగిచెర్ల డిపో మేనేజర్, . కవిత, డిప్యూటీ రీజినల్ మేనేజర్, ట్రైనర్- కాళేశ్వర్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *