12 లక్షల విలువైన 17 బైకులను రికవరీ చేసి దొంగల్ని అరెస్ట్ చేసి చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు – కేసును ఛేదించుటలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్

ఇటీవల కాలంలో దర్శి మరియు చుట్టుపక్కల ఏరియాలలో మోటారు సైకిళ్ళు దొంగతనం జరుగుతున్న క్రమంలో ప్రకాశం జిల్లా SP గారు అయిన ఏ ఆర్ దామోదర్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా ఛేదించాలని ఆదేశాలు ఇవ్వటంతో – దర్శి DSP- లక్ష్మీ నారాయణ పర్యవేక్షణలో, దర్శి CI- రామారావు ఆద్వర్యంలో రాయబడిన సమాచారంతో దర్శి SI మురళి మరియు వారి సిబ్బంది తో కలిసి పోతవరం గ్రామ శివారులో ఈ దినం వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా 2 బైకులపై వెళ్తున్న నలుగురు వ్యక్తులను ఆపి వారిని విచారించగా వారి వద్ద ఉన్న 2 బైకులు దర్శి పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగిలించబడిన వాహనాలుగా గుర్తించి వారిని పూర్తి స్తాయిలో విచారించగా, ఆ నలుగురు గతంలో చేసిన బైకు దొంగతనాల అన్నింటినీ ఒప్పుకొన్నారు. వారు దర్శి పోలీస్ స్టేషన్ ఏరియాలో 7 (ఏడు) బైకులు, ప్రకాశం జిల్లా కనిగిరి, పొదిలి ఏరియాలలో మరియు గుంటూర్ , పల్నాడు బాపట్ల జిల్లాలలో కూడా 10 (పది ) బైకులను దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోని వాటన్నిటినీ దేవవరం గ్రామస్తుడు గోపి అనే బైక్ మెకానిక్ కు అమ్మినట్లు చెప్పగా వెంటనే దర్శి si మురళి ఆ నాలుగురినీ అదుపులోకి తీసుకొని సదరు బైక్ మెకానిక్ గోపి వద్దనుండి 15 బైకులను స్వాదీనం చేసుకొని మొత్తం 5 మందిని ఈ దినం 15.11.2024 మధ్యాహ్నం అరెస్ట్ చేసి 17 బైకులను స్వాధీనం చేసుకోవటమైనది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పోలీస్ స్టేషన్ : దర్శి పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లా

రికవరీ చేసిన మొత్తం చోరీ సొత్తు విలువ : 17 బైకులు – వాటి విలువ – షుమారు 12 లక్షలు

ముద్దాయిల పేర్లు :

  1. అంకాల శ్రీను (21 సం) , గంగపాలెం గ్రామం, దర్శి మండలం
  2. కప్పల పవన్ (20 సం), గంగపాలెం గ్రామం, దర్శి మండలం
  3. కప్పల భవానీ శివ శంకర్(21 సం), గంగపాలెం గ్రామం, దర్శి మండలం
  4. బండారు శ్రీహరి (21 సం) , గంగపాలెం గ్రామం, దర్శి మండలం
  5. గుంజ గోపి (23 సం), దేవవరం గ్రామం, దర్శి మండలం

బైక్ దొంగతనం కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా ఛేదించాలనే పట్టుదలతో దర్శి డిఎస్పీ నాగేశ్వరరావు, దర్శి CI వై రామారావు , SI మురళి మరియు వారి సిబ్బంది అయిన ASI- రాంబాబు, HC- శివ శంకర్, PCs- మహేష్, గిరి జిల్లా SP గారు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *