విద్యుత్ అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్ను అందించే విధంగా సిబ్బంది కృషి చెయ్యాలని దర్శి విద్యుత్ ఈఈ పి శ్రీనివాసులు కోరారు. తాళ్లూరు విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన శనివారం సందర్శించారు. పెడింగ్ బిల్లులను ఎప్పటికప్పుడు వసూలు చెయ్యాలని జంగిల్ క్లియరెన్స్ చేయించి విద్యుత్ సరఫరా లోపాలను సవరించాలని కోరారు. పీఎం సూర్య ఘర్ దరఖాస్తులను పెంచాలని విద్యుత్ లబ్దిదారులకు సూర్య ఘర ఉపయోగాలను వివరించి మెరుగైన విద్యుత్, ఆదా ఉంటుందని తెలియజెయ్యాలని కోరారు. సిబ్బందికి పలు రకాల సూచనలు చేసారు. ఎఈ శ్రీనివాసరావు, ఎల్ఎ శ్రీనివాసరావు, జెఎల్ఎం లు సిబ్బది పాల్గొన్నారు.
