డీఎస్సీ -2024లో హాజరు అవుతున్న మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆశాఖ మంత్రి ఎండీ ఫరూక్ తెలిపినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నారాయణ తెలిపారు. అర్హత గల మైనార్టీ విద్యార్థులు అనగా ముస్లీంలు, క్రిస్టియన్ (బిసి-సి), సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్ సైట్ ను సందర్శించి లేదా డైరెక్టర్ కార్యాలయం, మైనార్టీ విద్యా అభివృద్ధి కేంద్రం, భవాని పురం ను విజయవాడ – 520012కి ఈనెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అదే విధంగా శిక్షణ ఇవ్వటానికి కూడ ప్రముఖ కోచింగ్ విద్యా సంస్థల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి బి నారాయణ వివరించారు
డీఎస్సీ – 2024 మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ
30
Nov