జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ (డీఐపీఆర్వో) అధికారిగా పీ వేణుగోపాల్ సోమవారం బాధ్యతలు స్వీక రించారు. ఇక్కడ ఇప్పటివరకు పనిచేసిన గ్రేస్లెనోర గత నెలాఖరులో ఉద్యోగ విర మణ చేయడంతో ఆ స్థానంలో నెల్లూరులో పనిచేస్తున్న వేణుగోపాల్ ను జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్ సోమవారం రాత్రి కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జేసీ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేష్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్య తలు స్వీకరించిన వేణుగోపాల్ సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు.


