విద్యార్థులకు అవసరమైన అభ్యసన సామాగ్రిని అందించడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ అన్నారు.తాళ్లూరు మండలంలోని శివరాంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (జనరల్) నందు సోమవారం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ మాజీ చైర్మన్ అనపర్తి పెద్ద నరసయ్య వర్ధంతి సందర్భంగా వారి తమ్ముడు రామస్వామి, కుటుంబ సభ్యు లు రామ నరసయ్య, బుల్లి నరసయ్య, బాల నరసయ్య, ఆదిశేషు, మేనల్లుడు తేళ్ళ రామస్వామి గార్ల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, స్వీట్లు , పండ్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పా ధ్యాయులు టి. శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, ఎంపీటీసీ అనుపర్తి చిన్న పుల్లమ్మ యోహాన్ గారు, ఎస్ఎంసి చైర్మన్ అనుపర్తి మారుతీరావు మరియు గ్రామ స్థులు పాల్గొనడం జరిగినది.


