ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో వచ్చే ఆర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో వచ్చే ఆర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, లోకేశ్వర రావులతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఆర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలన్నారు. ప్రతీ అర్జీకి అర్థవంతమైన సమాదానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ప్రతీ అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీ-ఓపెన్ అయినట్లైతే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. పై గ్రీవెన్స్ లో వచ్చిన ఆర్జీల పై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో 255 వినతులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *