ప్రజా ఫిర్యాదుల పట్ల అధిక దృష్టి సారించి భాదితులకు సత్వర న్యాయం అందేలా కృషి చెయ్యాలి -ప్రకాశం జిల్లా ఎస్పీ ఎ ఆర్.దామోదర్ -పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంకు 68 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్పీ ఎ ఆర్.దామోదర్ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యల గురించి జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులుకు విన్నవించుకున్నారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అందిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఒక వ్యక్తి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి తన బాతుల ఫారంలో పెట్టుబడులు పెట్టించి భాగస్వాములు చేసుకుంటానని తమను నమ్మించి లోన్ అమౌంట్ తన ఎంటర్ప్రైజెస్ కు మళ్లించుకొని తమకు అగ్రిమెంట్ ఇవ్వకుండా తమ వద్ద తీసుకున్నరూ.18,10,000/- అమౌంట్ తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయవలసిందిగా యన్.జి పాడు మండలానికి చెందిన ఐదు మంది బాధితులు ఫిర్యాదు.

కొత్తపట్నం మండలానికి చెందిన ఒక వ్యక్తి సంవత్సరం నుండి కిస్తీలు కట్టని బజాజ్ పల్సర్ బండిని మోసపూరితంగా తనకు అమ్మి తన వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి నుండి తన డబ్బులు ఇప్పించి న్యాయం చేయవలసిందిగా యస్.యన్ పాడు మండలానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు రూరల్ సీఐ యన్. శ్రీకాంత్ బాబు, ఐటి కోర్ సీఐ సూర్యనారాయణ, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, ప్రభాకర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *