ప్రజా నాయకుడు, మహా నాయకుడు నందమూరు తారక రామారావు అని దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరులో దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరు తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి మాట్లాడుతూ ….ఎన్ టి ఆర్ మహానటుడుగాను, రాజకీయ నాయకుడిగాను ఒకే జీవితంలో ఎవరూ సాధించలేని ఘనత సాధించారని అన్నారు. రాముడు గాను, క్రిష్ణుడి గాను మెప్పించారని, ప్రజా నాయకుడిగా 9 నెలలలో పార్టీని స్థాపించి పేదల పెన్నిదిగా సీఎం గా ఎన్నో సేవలు చేసారని కొనియాడారు. నేడు ఆయన బాటలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా పాలన సాగిస్తున్నారని, సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. నేడు సంక్రాంతి పండగను నివాసాలకు వచ్చిన తెలుగు వాళ్లు నాటి పాలనలో రోడ్ లు చూసి నేడు రోడ్లు చూసి చంద్రన్న పాలనలో మరలా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న విషయాన్ని చర్చించుకుంటున్నారని అన్నారు. ముందుగా ఎన్టిఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు శాగం కొండా రెడ్డి, మానం రమేష్ బాబు, కార్యదర్శి మేడగం వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పెద కాలేషా వలి (బడే), నియోజక వర్గ అధ్యక్షుడు షేక్ మీరా మోహినుద్దీన్ తాళ్లూరు యువ నాయుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ కమిటి చైర్మన్ తూము శివ నాగి రెడ్డి , సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర), కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, పాశం సూరిబాబు, పిన్నిక రమేష్ | యువ నాయకుడు నవులూరు విద్యాసాగర్, సునుం ఆదినారాయణ రెడ్డి, పాలం అంజి రెడ్డి, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డానీ, లక్ష్మి నారాయణ, హనుమా రెడ్డి, కోట యలమంద రావు తదితరులు పాల్గొన్నారు.

