ఓటు వేసే హక్కు ప్రతి పౌరుని కర్తవ్యమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. మండలంలో శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు ఎంఈఓ సుబ్బయ్య రెవిన్యూ, పోలీస్ సిబ్బందితో కలసి ఓటు ప్రాముఖ్యతను వివరించారు. తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు మాట్లాడుతూ ఓటు హక్కుతో నేటికి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పటిష్ట స్థితిలో ఉన్నదని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు.

