విఠలాపురం పంచాయితీ పరిధిలో ఉచిత పశువైద్యశిబిరాన్ని సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి ప్రారంభించారు. పశువైద్యాధికారి డాక్టర్ ప్రతాప్ రెడ్డి గేదేల గర్భకోశ, చూడి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసారు. గెదేలకు, దూడలకు, గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేసారు. 35 మంది పాడి రైతులకు మందులను అందించారు. ఎహెచ్ఎ మార్టిన్ లూధర్, సిబ్బంది పాల్గొన్నారు.


