తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 50 మందికి వైద్యులు పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ…. సమస్యలు ఉన్న వారిని పరీక్షించి, వారికి సలహాలు సూచనలు అందజేశామని తెలిపారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి తామే స్వయంగా తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి గ్రామాలకు క్షేమంగా చేరు స్తామని పేర్కొన్నారు. శిబిరంలో 15 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించి సోమవారికి వారికి మార్కా పురంలో చికిత్స చేస్తామని పేర్కొ న్నారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ అనిల్, ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి, దేవయ్య, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

