కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు టిడిపి పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, యూత్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బధిరుల పాఠశాలలోని చిన్నారులకు దుస్తులను, బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అన్నా క్యాంటీన్ మూడుపూట్ల పేదలకు అన్నదానం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, కన్వీనర్ పిచ్చల శ్రీనివాసరెడ్డి, టిడిపి నాయకులు తమ్మినేని వెంకట్ రెడ్డి, గుడిపాటి ఖాదర్, జిలాని ,పచ్చవ వెంకటేశ్వర్లు, మచమారి చెంచిరెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, బాలు ఓబుల్ రెడ్డి, నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిహెచ్.నాగార్జున యాదవ్, యు.శ్రీనివాసులు రెడ్డి, బి.ప్రసాద్ రెడ్డి, ఎ.రవి తదితరులు పాల్గొన్నారు.
