ప్రభుత్వం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో రైతుల నుండి వచ్చిన వినతుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ్ జ్యోతి కుమారి తెలిపారు. తాళ్లూరు మండలంలో రెవిన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల వివరాలను ఆమె మంగళవారం పరిశీలించారు.
సదస్సులలో వివిధ సమస్యలపై 263 వినతులు రాగా అందులో 188 పరిష్కరించినట్లు తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు తెలిపారు. 75 పరిష్కారం కావాల్సి ఉందని అందులో 41 రెవిన్యూ సమస్యలు, 18 సర్వేకి సంబంధించిన సమస్యలుగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. పరిష్కరించిన సమస్యలలో ఎవైనా లోపాలు ఉన్నాయా అన్ని విషయాలను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఆయా ఫైల్స్ ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ ఐ ప్రశాంత్, విఆర్ ఓ లు పాల్గొన్నారు.
