నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా:. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్

జిల్లాలో నేరాలను నియంత్రించే చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు నియంత్రణ,అసాంఘిక కార్యకలాపాలపై మారుమూల ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

1) కనిగిరి పట్టణ గ్రానైట్ ప్యాక్టరీల ప్రెసిడెంట్ ముచ్చుమర్రి చెంచు రెడ్డి మరియు ఫ్యాక్టరీ సభ్యులు, 2) వెలిగండ్లకు చెందిన చెన్న కృష్ణయ్య, లక్ష్మీనారాయణ (టీచర్), భగవాన్ మైన్స్ కంపెనీ వారు, 3) ముండ్లమూరుకు చెందిన కుంచాల పెద నాగరాజు (కార్తికేయ కన్స్ట్రక్షన్స్ సంస్థ, హైదరాబాద్), 4) పామూరుకు చెందిన గుంటుపల్లి దశరథ రామయ్య, 5) గిద్దలూరుకు చెందిన మారడు దిలీప్ మరియు వేములపాటి చంటి, 6) A.శ్రీనివాసరావు (శ్రీ సహజానంద హై స్కూల్, పెట్లూరు), M. హరినాథ్ (శాంతినికేతన్ హై స్కూల్, కొండపి) ఆర్. శ్రీనివాసరావు (సాయిబాబా విద్యాలయం, కొండపి), Ch. సిద్ధార్థ శిశిర్ (పాపారావు పబ్లిక్ స్కూల్, K. ఉప్పలపాడు), N. ప్రసన్నకుమార్ (కిడ్స్ హై స్కూల్, కొండపి) K. రాజేష్ (శ్రీ చాణిక్య జూనియర్ కాలేజ్, కొండపి) ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ కి అత్యాధునిక సాంకేతికత కూడిన 6 DJI Air3s డ్రోన్ కెమెరాలను అందచేసినారు.
జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో పోలీస్ శాఖకు ఒక డ్రోన్‌ ను బహుకరించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ శాఖ తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రోన్ లను ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు జిల్లా ఎస్పీ అందచేశారు.

జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
మాట్లాడుతూ…… డ్రోన్ టెక్నాలజీని వినియోగించి, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో చైన్‌ స్నాచింగ్స్‌, ఈవ్‌ టీజింగు, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు/నిశిత ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్‌ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ విఐపిల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుందని, ముఖ్య కూడళ్ళలో ట్రాఫిక్‌ నియంత్రణ, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్‌ వినియోగిస్తున్నట్లు చెప్పారు. డ్రోన్స్‌ వినియోగంపై పోలీస్‌ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, కనిగిరి సిఐ ఖాజావళీ, దర్శి సీఐ రామారావు, పామూరు సీఐ బీమా నాయక్, కొండేపి సీఐ సోమశేఖర్, గిద్దలూరు సీఐ కె.సురేష్, ఎస్సైలు మధుసూధనరావు, నాగరాజు, కిషోర్, ప్రేమకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *