ప్రాంగణ ఎంపికలలో 21 మంది శ్రీహర్షిణి విద్యార్థుల ఎంపిక

శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాలలో శనివారం నాడు HDFC బ్యాంకు వారు అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్) ప్రాంగణ ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపికలలో శ్రీ హర్షిణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు 21 మంది ఎంపిక కాబడ్డారు. వీరి సంవత్సర వేతనం మొదటి సంవత్సరం 4.42 లక్షల గా ఉంటుంది, రెండవ సంవత్సరం 5.10 లక్షలు, మూడవ సంవత్సరం 6.10 లక్షలు మరియు నాలుగవ సంవత్సరం నుండి బ్యాంకు మేనేజర్ గా ప్రమోషన్ ఇవ్వబడుతుంది అని HR అంజన కుమార్ మరియు నాగార్జున తెలియజేశారు. ఈ ఉద్యోగం పూర్తిగా HDFC బ్యాంకులో ఉండి చేసేటువంటి ఉద్యోగము అని తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ …… ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా కాలేజీ స్థాపించిన నాటి నుండి డిగ్రీ విద్యార్థులకు ఇంజనీరింగ్ తో పోటీగా ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తూ వాటికి కావలసిన కోచింగ్ కూడా డిగ్రీ మొదటి సంవత్సరమునుండే ఉచితంగా ఇస్తున్న ఏకైక విద్యాసంస్థ శ్రీహర్షిణి అని తెలియజేశారు. ప్రతి సంవత్సరం శ్రీ హర్షిణి విద్యాసంస్థలలో డిగ్రీ పూర్తయిన విద్యార్థులు డిగ్రీతో పాటు ప్రాంగణ ఎంపికలలో నియామక పత్రాలను కూడా తీసుకొని వెళ్లడం సంతోషకర పరిణామము అని తెలియజేశారు. అదేవిధంగా త్వరలో ప్రముఖ మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలైన HCL, CAPGEMINI కంపెనీల సే కూడా ప్రాంగణ ఎంపికలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో సెక్రెటరీ ఎండ కరస్పాండెంట్ గోరంట్ల కవిత , ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు , పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి , AO ర్యాంకర్ శ్రీనివాసరావు , గిరీష్, ప్రతాప్ , శంకర్ ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *