రైతు తాము పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధరప్రకటించి రైతులకు మేలు చేసేలా తగిన చర్యలు తీసుకుంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు అన్నారు. తూర్పుగంగవరంలో నాగంబొట్ల పాలెం పీఎసీ ఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం కందులకు మద్దతు ధర రూ. 7550 ప్రకటించినందని అంతకన్నా బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర వస్తే అమ్ముకోవచ్చని చెప్పారు. రైతుల నుండి మాత్రమే ఎపీ మార్కేఫేడ్ మరియు నాఫేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కందులు కొనుగోలు చేస్తారని తెలిపారు. అందుకు ఈ- పంట నమోదు అయి ఉండి, పంట అమ్మకంకు నమోదవు చేసుకోవాలని కోరారు. రైతులు తప్పని సరిగా యునిక్ నంబర్ కోసం రిజస్టర్ కావాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలుకు ఈ నంబర్ రాబోవు రోజులలో ఆధారమని అన్నారు. ఎవో ప్రసాద రావు మాటాడుతూ నిర్ణయించిని నాణ్యత ప్రమాణాల మేరకు కందులు ఉండేలా చూసుకోవాలని కోరారు . కందులు రిజిస్ట్రేషన్ చేయించుకోని వాటిని సొసైటీ ద్వారా అమ్మకునే వీలుందని చెప్పారు. కార్యక్రమంలో టెక్నికల్ ఎవో శ్రీనివాస నాయక్, సొసైటీ సీఈఓ ఎస్ శ్రీనివాస రెడ్డి. విఏఏ వెంకట సుమ తదితరులు పాల్గొన్నారు.

