ప్రజలకు మేలు చేసి వారి గుండెల్లో శాశ్విత స్థానం సంపాదిస్తాం- టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి – మంత్రి నారా లోకేష్ మాకు ఆదర్శం

దర్శి నియోజక వర్గంలో ప్రజలకు మేలు చేసి వారి గుండెల్లో శాశ్విత స్థానం సంపాదించి తద్వారా దర్శి నియోజక వర్గ అభివృద్ధి మరింతగా చేస్తామని టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో స్వచ్చ కార్పోరేషన్ ద్వారా శివరామ పురం , నాగం బొట్ల పాలెం,
బొద్దికూర పాడు, లక్కవరం గ్రామాలకు మంజూరు అయిన నాలుగు ట్రాక్టర్లను పంచాయితీలకు అందించే కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ …. మంత్రి నారా లోకేష్ తనకు ఆదర్శమని ఆయన ఎంతో క్లిష్టమైన నియోజక వర్గం మంగళ గిరిలో పోటీ చేసి ఎంతో పట్టుదలతో గెలిచారని అన్నారు. అదే పంథాలో దర్శి నియోజక వర్గం కూడ ఎంతో క్లిష్టమైన విషయం అందరికి తెలిసినదే అని అన్నారు. తాను కూడ ప్రజలకు సేవ, నియోజక వర్గం అభివృద్ధి మరింత చేసి ప్రజల మనస్సులు గెలిచి 25 ఏళ్ల పాటు సేవ చేస్తానని అన్నారు. కార్యకర్తలకు, నాయకులు ఎంతో సంయమనం పాటిస్తూ తోడ్పాటు ఇవ్వాలని అన్నారు. గత వైసీపీ పాలకుల వలే తొందర పాటు, కక్ష్య సాధింపులకు పాల్పడవద్దని హితవు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయయు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో స్వచ్చ ఆంధ్ర- స్వచ్చ దివాస్లో బాగంగా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు స్వచ్ఛ కార్పోరేషన్ ద్వారా వాహనాలు మంజూరు అయ్యాయని వాటిని జాగ్రత్తగా ఉపయోగించి గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలని కోరారు.ఒక డాక్టర్గా స్వచ్ఛతతో ఆరోగ్యం బాగు పడుతుందని గట్టిగా నమ్ముతాను అని అదే కోణంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడ స్వచ్చతకు పెద్ద పీట వేసారని అన్నారు. ప్రజా బాగస్వామ్యంతో పెద్ద ఎత్తున తరలివచ్చి పార్కును బాగు చేసుకునే కార్యక్రమం ఎంతో స్ఫూర్తి నిచ్చిందని అన్నారు. దర్శి నియోజక వర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మించిన రోడ్లను, సీసీ రోడ్ల గురించి వివరించారు. మొగలిగుండాల రిజర్వాయర్, శివరామపురం వద్ద విద్యుత్ స్టేషన్ సైతం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం అందజేశామని… అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని వివరించారు. అనంతరం ఆయా గ్రామాలకు డాక్టర్ కడియాల లతిత్ సాగర్ తో కలిసి ట్రాక్టర్లను స్టార్ట్ చేసి నడిపి పంచాయితీలకు ట్రాక్టర్లను అందించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి ఎన్ .టి. ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, పార్టీ అధ్యక్షుడు ఓబులు రెడ్డి, మాజీ సర్పంచి ఐవీ రమణా రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, శాగం కొండా రెడ్డి, మానం రమేష్ బాబు, పెద కాలేషా వలి, గొల్లపూడి వేణుబాబు, మాజీ సర్పంచి వలి , మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాచకొండ వెంకట రావు, తూము శివ నాగి రెడ్డి, గొంది రమణా రెడ్డి, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డానీ, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, పాశం సూరిబాబు (పెద్దన్న), పిన్నిక రమేష్, వల్లభనేని సుబ్బయ్య, యాతం శ్రీనివాస రెడ్డి, సర్పంచులు గురువారెడ్డి కొర్రపాటి శ్రీదేవి ,రామయ్య ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. అధికారులు తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, ఎంపీడీఓ దార హనుమంతరావు, గ్రామ కార్యదర్శి ఐవీ రమణా రెడ్డి, సీడీపీఓ సీహెచ్ భారతి, వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి, ఎపీఓ మురళి, ఎపీఎం దేవరాజ్,వ్యవసాయాధికారి ప్రసాద రావు తదితరులు పాల్గొని డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులను ఘనంగా సన్మానించారు. ముందుగా ఎస్సీ కాలనీ వాసులతో పాటు పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తూ వినతులు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *