నారీ లోక శక్తి మహోన్నతమైనది. అంగన్వాడీ పౌష్టికాహారం పరిశీలన…..

మహిళా వారోత్సవాలలో బాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సీడీపీఓ సిహెచ్ భారతి, సూపర్ వైజర్ జ్యోతి ఏర్పాటు చేసిన పౌష్టికాహారం ప్రదర్శనను టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ గొట్టిపాటి మాట్లాడుతూ…. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఇంకా ముందుకు సాగాలని మాలాంటి డాక్టర్లు అధిక సంఖ్యలో మహిళలే ఉండటం గర్వకారణమని అన్నారు. క్రీడలతో పాటు, అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడటం ఎంతో శుభ పరిణామమని అన్నారు. స్థానికంగా దొరికే పౌష్టికాహార ప్రాధాన్యతను వివరించి మహిళలు, బాలింతల, చిన్నారుల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలని కోరారు. మహిళా వారోత్సవాల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కృషితో అనేక మహిళా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం పౌష్టికాహారాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు రుచి చూసారు. ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ చార్ట్ లో సంతరం చేసారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గొట్టిపాటి దంపతులను ఘనంగా సన్మానించారు. ముందుగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో యునిక్ నంబర్ను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీడీఓ దార హనుమంత రావు ,వ్యవసాయాధికారి ప్రసాద రావు,మాజీ సర్పంచి ఐవీ రమణా రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, శాగం కొండా రెడ్డి, మానం రమేష్ బాబు, పెద కాలేషా వలి, గొల్లపూడి వేణుబాబు, మాజీ సర్పంచి వలి , మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాచకొండ వెంకట రావు, తూము శివ నాగి రెడ్డి, గొంది రమణా రెడ్డి, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డానీ, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, పాశం సూరిబాబు (పెద్దన్న), పిన్నిక రమేష్, వల్లభనేని సుబ్బయ్య, యాతం శ్రీనివాస రెడ్డి, సర్పంచులు గురువారెడ్డి కొర్రపాటి శ్రీదేవి ,రామయ్య ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. అధికారులు .. .. తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, ఎంపీడీఓ దార హనుమంతరావు, గ్రామ కార్యదర్శి ఐవీ రమణా రెడ్డి,
 సీడీపీఓ సీహెచ్ భారతి, వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి, ఎపీఓ మురళి, ఎపీఎం దేవరాజ్ తదితరులు పాల్గొని డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులను ఘనంగా సన్మానించారు. ముందుగా ఎస్సీ కాలనీ వాసులతో పాటు పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తూ వినతులు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *