హోలీ వేడుకలలో ఉపయోగించే రంగులతో చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, రంగుల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని సరోజినీకంటే ఆసుపత్రి మాజీ సూపరిండెంట్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ రవీందర్ గౌడ్ హెచ్చరించారు. వివిధ రకాల రసాయనాలు కలిపిన రంగు నీళ్లు కళ్ళలోకి చేరడం వల్ల కార్నియా దెబ్బతిని అవకాశం ఉందన్నారు. హోలీ సందర్భంగా కళ్ళలో కి రంగులు పడినవారు వెంటనే నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలని ఆయన సూచించారు. హోలీ వేడుకలు సందర్భంగా సరోజినీ కంటి ఆసుపత్రిలో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. బల్కంపేట శంకర నేత్రాలయంలో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రవీందర్ గౌడ్ తెలియజేశారు.
