పొలం పనులకు మోటార్ సైకిల్ పై
వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ జారిపడి వెలుగువారిపాలెం గ్రామంలో ఓ రైతు మృతి చెం దిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో
గురువారం కేసు నమోదయింది. వివరాల్లోకి వెలితే వెలుగువారిపాలెం గ్రామానికి చెందిన మూలంరెడ్డి వెంకటేశ్వర్లు తన మోటార్ వాహనంపై బుధవారం సాయంత్రం పొలం పనులకు వెళ్లాడు. రాత్రి వేళ ఇంటికి తిరిగి వస్తుండగా జారిపడగా మోటార్ సైకిల్ అతనిపై పడి తల, గుండెపై తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వర్లు రాత్రి ఇంటికి రాక పోవటంతో కుటుంబీకులు తిరునాళ్లకు వెళ్లాడన్న 4ఆలోచనతో మిన్న కున్నారు. ఉదయం మృతుని భార్య కోటేశ్వరమ్మ పొలంకు వెళ్లగా మోటార్ సైకిల్ పడి వుండి, దాని కింద భర్త వెంకటేశ్వర్లు విగత జీవిగా పడి వున్నాడు. దగ్గరికి వెళ్లి చూడగా ఉలుకు, పలుకు లేకుండా పడివుండటంతో బంధువులకు సమాచారం ఇకున్నారు. ఉదయం మృతుని భార్య కోటేశ్వరమ్మ పొలంకు వెళ్లగా మోటార్ సైకిల్ పడి వుండి, దాని కింద భర్త వెంకటేశ్వర్లు విగత జీవిగా పడి వున్నాడు. దగ్గరికి వెళ్లి చూడగా ఉలుకు, పలుకు లేకుండా పడివుండటంతో బంధువులకు సమాచారం ఇ వ్వటంతో వచ్చి చూడగా మృతిచెందియున్నాడు. మృతునిభార్య కోటేశ్వరమ్మ ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృతుని భార్య, నలుగురు సంతానం ఉన్నారు.

