పనులపై మేట్లు అవగాహన కలిగి ఉండాలి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వేగ వంతం చేయాలని ఏపీవో కే మురళి అన్నారు. తాళ్లూరు ఎంఎన్ఆర్ఆజీఎస్ కార్యాలయంలో ఉపాధిమేట్లకు బుధవారం శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ ఓ మురళి మాట్లాడుతూ…ఉపాధి హామీ పనుల నిర్వహణలో మేట్లు పూర్తి అవగాహన కలిగి ఉండి పనులుచేయించాలని కోరారు. ఉపాధి కూలీలకు రోజు వారీ వేతనం రూ.300లు పడేలా మేట్లు కృషి చేయాలని అన్నారు.


