పేదరిక నిర్మూలన టిడిడితోనే సాధ్యం – ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎర్పడినదని ఆపార్టీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ లు అన్నారు. తాళ్లూరు ఎన్. టి.ఆర్ విగ్రహం వద్ద ఆమె దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ టిఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ లు మాట్లాడుతూ… సామాజిక పెన్షన్, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వంటి అనేక సంక్షేమ పధకాలు టిడిపి పార్టీలోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేసారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఆయన ఆశయ సాధనకు ఎంతో కృషి చేస్తున్నారని, అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగు తున్నారని అన్నారు. భారీ కేక్ ను కట్ చేసి పంచి పెట్టారు. ఆయా కార్యక్రమాలలో పార్టీ అధ్యక్షుడు ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, శాగం కొండా రెడ్డి, పెద కాలేషా వలి, గొల్లపూడి వేణుబాబు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాచకొండ వెంకట రావు, తూము శివ నాగి రెడ్డి, , వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డానీ, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, పాశం సూరిబాబు (పెద్దన్న). పిన్నిక రమేష్ , యాతం శ్రీనివాస రెడ్డి, చిలకల అంజమ్మ, సుజాత, కళ్యాణ్, మీరామోహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు. బొద్దికూరపాడు, తూర్పుగంగవరంలతో పాటు పలు గ్రామాలలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక నాయకులు జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *