రాంగోపాల్ పేట మార్చి 31 (జేఎస్ డీఎం న్యూస్) :
ముస్లీం లు అత్యంత భక్తిశ్రద్ధలతో, గొప్పగా జరుపుకునే పండుగ రంజాన్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా రాంగోపాల్ పేట డివిజన్ లోని సుభాష్ రోడ్ లో జామియా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రపంచంలోని ముస్లీం సోదర సోదరీమణులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారని గుర్తు చేశారు.
ఈ ప్రార్ధనలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి శ్రీనివాస్ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్ కుమార్, ఆంజనేయులు, మజీద్ ప్రెసిడెంట్ మహమ్మద్ వాజిద్ సెట్, సెక్రటరీ మహ్మద్ మసి సాబ్, సాదిక్ బాయ్, రైమాన్,లతీఫ్,అబ్బులు తదితరులు పాల్గొన్నారు.

