డెర్మ‌టోస‌ర్జ‌రీకి పెరుగుతున్న ప్రాధాన్యం.నైపుణ్యాల‌ను వైద్యులు మెరుగుప‌రుచుకోవాలి.కిమ్స్ ఆస్ప‌త్రి సీ ఈ ఓడాక్ట‌ర్ భాస్క‌ర‌రావు సూచ‌న‌. ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో డెర్మ‌టోస‌ర్జ‌రీపై వ‌ర్క్‌షాప్‌.భార‌త్‌, నేపాల్‌ల నుంచి 300 మంది వైద్యుల హాజ‌రు

హైద‌రాబాద్, ఏప్రిల్ 27 :
డెర్మ‌టాల‌జీ విభాగంలో డెర్మ‌టోస‌ర్జ‌రీ అనే ఉప విభాగానికి ప్రాధాన్యం
బాగా పెరుగుతోంద‌ని, ఈ విష‌యంలో నైపుణ్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగుప‌రుచుకుంటేనే రోగుల‌కు మెరుగైన ఫ‌లితాల‌ను అందించ‌గ‌ల‌మ‌ని కిమ్స్ ఆస్ప‌త్రి ​సీఎండి డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు అన్నారు. కిమ్స్ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ఆదివారం ఏసీఎస్‌(ఐ) ఈసీ, అకాడ‌మీ స‌మ‌న్వ‌యంతో డెర్మ‌టోస‌ర్జ‌రీపై వైద్యుల కోసం ఒక వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఇందులో ప్ర‌ధానంగా కుట్లు వేసే టెక్నిక్‌ల‌పై అక్క‌డిక‌క్క‌డ కూడా ప‌లువురు డెర్మ‌టాల‌జిస్టుల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. “రోజువారీ ప్రాక్టీసులో అభివృద్ధి చెందుతున్న డెర్మ‌టో స‌ర్జ‌రీ.. ప్రెసిష‌న్‌, ప్యాష‌న్‌, ఎక్స‌లెన్స్ అండ్ ప్రోగ్రెస్‌” అనే ఇతివృత్తంతో ఈ స‌ద‌స్సు నిర్వ‌హించారు. భార‌త్, నేపాల్ దేశాల నుంచి సుమారు 300 మందికి పైగా డెర్మ‌టాల‌జిస్టులు ఈ వ‌ర్క్‌షాప్‌లో పాల్గొని, త‌మ శ‌స్త్రచికిత్సా నైపుణ్యాల‌ను పెంచుకునేందుకు దీన్ని స‌మ‌ర్థంగాఉప‌యోగించుకన్నారు.ఈ వ‌ర్క్‌షాప్‌కు డాక్ట‌ర్ కొణ‌తం రాజ్య‌ల‌క్ష్మి నేతృత్వం వ‌హించారు. ఆమెకు డాక్ట‌ర్ అంచ‌ల పార్థ‌సార‌థి, డాక్ట‌ర్ ఏఎస్ కుమార్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనుభ‌వ‌జ్ఞులైన జాతీయ‌, స్థానిక వైద్యులు డాక్ట‌ర్ నితిన్ జైన్‌, డాక్ట‌ర్ యోగేష్ భింగ్రాడియా, డాక్ట‌ర్ నందిత‌, డాక్ట‌ర్ నితిన్ బార్డే, డాక్ట‌ర్ మాన‌స్ రంజ‌న్ ఫుకాన్‌, డాక్ట‌ర్ తేజ‌స్విని స‌లుంకే, డాక్ట‌ర్ ఆనంద్ వ‌గ్గు, డాక్ట‌ర్ జ్యోత్స్న గంప‌, డాక్ట‌ర్ రాకేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. జాతీయ వ‌ర్క్‌షాప్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా డాక్ట‌ర్ టి. శిరీష కీల‌క‌పాత్ర పోషించారు.ప‌లువురు యువ‌వైద్యులు కూడా ఈ వ‌ర్క్‌షాప్‌కు స‌మ‌న్వ‌యం చేశారు. వారిలో డాక్ట‌ర్ శ్రుతి కొండ‌వీటి, డాక్ట‌ర్ మాన‌వి, డాక్ట‌ర్ మ‌నోజ్ఞ‌, డాక్ట‌ర్ రీతూ గుజ్రాల్‌, డాక్ట‌ర్ జి.జ్యోత్స్న‌, డాక్ట‌ర్ ప్ర‌ణీత‌, డాక్ట‌ర్ శ్రుతి కొడాలి త‌దిత‌రులు ఉన్నారు.
ఏసీఎస్(ఐ) ప్రెసిడెంట్ డాక్ట‌ర్ టి. స‌లీం, గౌర‌వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ప్ర‌దీప్ కుమారి ఈ వ‌ర్క్‌షాప్‌కు నేతృత్వం వ‌హించారు. వారి ప్రోత్సాహం, ప్ర‌ణాళిక‌ల వ‌ల్లే ఇది విజ‌య‌వంతం అయ్యింది. ఈ కార్య‌క్ర‌మంలో ఇంకా టీఎస్ ఐఏడీవీఎల్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ వి. ర‌మేష్‌, టీఎస్ ఐఏడీవీఎల్ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ రామ‌చంద‌ర్ దార‌క్ కూడా పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *