కాశ్మీర్లో తీవ్ర వాదులు కాల్పులకు నిరసనగా దర్శిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేశారు. 28 మంది ప్రాణాలు బలిగొన్న దోషులను కఠినంగా శిక్షించాలి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే ప్రకాశం జిల్లా కార్యదర్శి పోలినేని వెంకటేశ్వర్లు, నరేంద్ర , దర్శి నియోజకవర్గంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
