పేదలు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి…. సీనియర్ న్యాయమూర్తి కిరణ్ కుమార్.

హైదరాబాద్ మే 1 (జె ఎస్ డి ఎం న్యూస్)
పేద వర్గాల ప్రజలు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సీనియర్ న్యాయమూర్తి డి కిరణ్ కుమార్ అన్నారు. మే డే సందర్భంగా బాలాజీ నగర్ లేబర్ అడ్డాలో నామినేటెడ్ మెంబర్ బి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా న్యాయమూర్తి పి. శ్రీదేవి ఆదేశాల మేరకు బాలాజీ నగర్ లేబర్ అడ్డాలో ఉచిత న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ న్యాయమూర్తి డి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేదలు న్యాయం కోసం ఉచిత న్యాయ సహాయ కేంద్రాల ను ఉపయోగించుకోవాలన్నారు. ఎలాంటి సమస్యల పరిష్కారం కోసమైనా ఈ ఉచిత న్యాయ సహాయ సేవ లను వినియోగించుకోవాలన్నారు. ఉచిత న్యాయ సహాయ సేవలను ఎలా పొందాలి ప్రభుత్వ పథకాలను ఎలా వినియోగించుకోవాలి తదితర విషయాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పి యల్ వి ఎస్. డి .రాకేష్, నామినేటెడ్ మెంబర్ బి.సురేష్ కుమార్, వై మల్లేష్ ,ఎం బాబు, వసంత, విమలక్క తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *