వరుసగా దిగ్గజాల రిటైర్మెంట్లు.. టీమ్ ఇండియాలో అసలు ఏం జరుగుతోంది?

దీంతో అసలు టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది? అనే చర్చ మొదలైంది. వాస్తవానికి కోహ్లి ఫామ్, ఫిట్ నెస్ బాగున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ లో విఫలమైనా ఆస్ట్రేలియాలో మోస్తరుగా ఆడిన కోహ్లి.. ఆ తర్వాత గాడినపడ్డాడు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ జరుగుతుండగానే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్.రొక్క నెల రోజుల్లో ఇంగ్లండ్ తో ఇంగ్లండ్ లో కీలకమైన ఐదు టెస్టుల సిరీస్ ఉందనగా కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు.. రోహిత్ లేని నేపథ్యంలో మరింత బాధ్యత మీద పడిన టీమ్ ఇండియా బ్యాటింగ్ మూల స్తంభం విరాట్ కోహ్లి కూడా రిటైర్మెంట్.. దీంతో అసలు టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది? అనే చర్చ మొదలైంది. వాస్తవానికి కోహ్లి ఫామ్, ఫిట్ నెస్ బాగున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్ లో విఫలమైనా ఆస్ట్రేలియాలో మోస్తరుగా ఆడిన కోహ్లి.. ఆ తర్వాత గాడినపడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు.20ల నుంచి ఏడాది కిందటే వైదొలగినందున.. వన్డేలు ఎలాగూ చాలా తక్కువే కాబట్టి.. తాను ఎంతో టెస్టు క్రికెట్ కు కోహ్లి ఇంత త్వరగా రిటైర్మెంట్ ఇస్తాడని ఎవరూ భావించలేదు. కానీ, అనూహ్యంగా ప్రకటన చేసేశాడు. రిటైర్మెంట్ పై మూడు రోజుల కిందటే ఊహాగానాలు వచ్చినా.. సీనియర్లు, క్రికెట్ నిపుణులు వద్దని వారిస్తున్నా కోహ్లి నిర్ణయం తీసేసుకున్నాడు. ఈ రిటైర్మెంట్లనీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చాకే జరగడం గమనార్హం.ఆటగాడిగా, వ్యక్తిగా గౌతమ్ గంభీర్ ను వంక పెట్టే పరిస్థితే లేదు. అయితే, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అతడు వచ్చాక జరుగుతున్న పరిణామాలే గంభీర్ తీరును చర్చనీయాంశం చేస్తున్నాయి. వాస్తవానికి రోహిత్ సంగతి చెప్పలేకున్నా అశ్విన్ మరొక ఏడాది, కోహ్లి మరొక రెండేళ్లు అయినా ఆడేవారేమో..? కానీ, రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఈ విషయంలో గంభీర్ ఒత్తిడి ఉందా? అనే ప్రశ్న వస్తోంది. ఒకవేళ గంభీర్ కోణంలోనే చూస్తే.. జూన్ లో ఇంగ్లండ్ తో సిరీస్ నుంచి మొదలయ్యే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ మరో రెండేళ్లు జరుగుతుంది. దీనికోసం తనదైన మార్క్ జట్టును గంభీర్ సిద్ధం చేసుకుంటున్నాడా? అనిపిస్తోంది. ఒకవేల రోహిత్, అశ్విన్ వచ్చే టెస్టు చాంపియన్ షిప్ మొత్ కొనసాగడం కష్టమే. కోహ్లి మాత్రం ఆడే వీలుండేది. కానీ, గంభీర్ ఆలోచనలను పసిగట్టి.. ముందే రిటైర్మెంట్ ఇచ్చేస్తే పోలా? అనుకున్నారో ఏమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *