ముగిసిన భారత్ – పాక్ డీజీఎంవో చర్చలు.. టాపిక్స్ ఇవే!

అవును… భారత్ – పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు, కాల్పుల విరమణ అనంతరం నేడు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు భేటీ అయ్యారు. భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శనివారం మధ్యాహ్నం 3:30 కి పాక్ డీజీఎంవో.. భారత డీజీఎంవో కు ఫోన్ చేశారని.. అనంతరం ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత సీజ్ ఫైర్ ప్రకటన వచ్చిందనే ప్రకటన వచ్చింది.ఆ సందర్భంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి.. ఇరు దేశాల మధ్య సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుంచి నిలిపేయాలని అంగీకరించినట్లు తెలిపారు. మే 12న డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ మళ్లీ మాట్లాడతారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో చెప్పినట్లుగానే ఈ రోజు మీటింగ్ జరిగింది.ఈ నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా వారిరువురి మధ్య చర్చలు ముగిసాయి. వీరి మధ్య ప్రధానంగా.. కాల్పుల విరమణ కొనసాగింపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఉద్రిక్తతల తగ్గింపు మొదలైన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే… ఈ చర్చల్లో ఏమి తేలిందనే విషయం మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది! మరోవైపు ఈ రోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ దేశప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఇరుదేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని మొదటిసారిగా సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *