క్షేత్ర స్థాయిలో ఉన్న బలహీన పిల్లల (వనరబుల్ చిల్ర్ద్రెన్ ) కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యనం చేసి వివరాలు సేకరించినట్లయితే, వారి అవసరాలను గుర్తించి ఆయా కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
బుధవారం మార్కాపురం మెప్మా కార్యాలయంలో బలహీన పిల్లల (వనరబుల్ చిల్ర్ద్రెన్ ) కుటుంబ స్థితిగతులపై అధ్యనం చేసేందుకు రూపొందించిన యాప్ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హాజరై మాట్లాడుతూ….. క్షేత్ర స్థాయిలో ఉన్న బలహీన పిల్లల (వనరబుల్ చిల్ర్ద్రెన్ ) కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యనం చేసి, వారి అవసరాలను గుర్తించి ఆయా కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద రాచర్ల మండలాన్ని ఎంపిక చేసి , బలహీన పిల్లల కుటుంబ స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యనం చేయడం జరిగిందన్నారు. అందులో 360 మంది పిల్లలను గుర్తించినట్లు వివరించారు. అందులో కొందరు మూడు చక్రాల కుర్చీలు అవసరమని తెలపగా వారికి అందచేయడం జరిగిందన్నారు. ఇలా ఆయా కుటుంబాలకు అవసరమైన ఇల్లు మంజూరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మంజూరు, స్కూల్ లో చేర్పించడం తదితర అవసరాలను ప్రభుత్వ పరంగా తీర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ యాప్ పై పూర్తీ స్థాయిలో అవగాహన కల్పించుకుని, బలహీన పిల్లల కుటుంబ స్థితిగతుల వివరాలను నమోదు చేసి ఆయా కుటుంబాలకు కావాల్సిన నిజమైన అవసరాలను యాప్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్, మహిళా పోలీసులకు, ఐసిడిఎస్ సిబ్బందికి సూచించారు. ఈ అధ్యయన కార్యక్రమంలో ఐసిడిఎస్, విద్యా శాఖ, మెడికల్ సిబ్బందితో పాటు ఆయా ప్రాంతాల స్వచ్చంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా మహిళా, శిశు సంరక్షణ అధికారిణి హేన సుజన్, డీసీపీవో దినేష్ కుమార్, బంగారు బాల్యం నోడల్ అధికారి గిరిధర్ శర్మ, సార్డ్స్ ప్రతినిధి సునీల్, ఐసిడీస్ సిబ్బంది, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మార్కాపురం పట్టణంలోని 12వ వార్డులో గల సచివాలయంను సందర్శించి జరుగుచున్న 0 నుండి 6 సంవత్సరాల పిల్లల ఆధార్ సీడింగ్ ప్రక్రియను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరుచేసిన ఆదార్ కార్డును సంబంధిత కార్డుదారులకు అందచేసారు. కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, మునిసిపల్ కమీషనర్ నారాయణ, తహసిల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.



