పేద వర్గాల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. తాళ్లూరు మండలానికి చెందిన 5 గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను దర్శిలో డాక్టర్ గొట్టిపాటి నివాసం వద్ద బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి అ నారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎంరిలీప్ ఫండ్ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదన్నారు. మండలంలోలక్కవరం గ్రామానికి చెందిన ఇరువురికి , తాళ్లూరు గ్రామానికి చెందిన ఇరువురికి ,రమణాలవారిపాలెంలో ఒకరికి కలిపిమొత్తం 5గురికి రూ 1లక్షా 76వేల,148 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గొట్టిపాటి లక్ష్మి వారికి అందజేశారు. ఈకార్య క్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు ఐ.శ్రీనివాసరెడ్డి, బి.హనుమారెడ్డి, టీ. లక్ష్మీరెడ్డితదితరులు పాల్గొన్నారు.
