బేగంపేట ఆగస్టు 3 (జేఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ పరిధిలోని వివిధ బస్సులకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ద్వారా మంజూరైన చెక్కులను బేగంపేట బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి రాజ్యలక్ష్మి ఆనంద్ ఆదివారం పంపిణీ చేశారు. బ్రాహ్మణ వాడికి చెందిన వజ్రవ్వ కు రూ 13500 లు, శ్యాంలాల్ బిల్డింగ్ చెందిన కే శిరీష కు 18000 లు, శ్యాంలాల్ బిల్డింగ్ కు చెందిన అనసూయకు రూ 18500లు, శ్యాంలాల్ బిల్డింగ్ కు చెందిన శ్రీకృష్ణకు రూ 34,500లు, భగవంతుపూర్ కు చెందిన ఏ నరేష్ కు రూ 9000లు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు నెమలి ఆనంద్ (నందు), మైసూర్ మధుసూదన్ బిజెపి బేగంపేట డివిజన్ అధ్యక్షుడు మహేష్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్, ప్రమోద్, మైనార్టీ మోర్చా నాయకుడు యాకూబ్ పాల్గొన్నారు

