బేగంపేట ఆగస్టు 3 (జేఎస్ డీఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వి శ్యామల మరోసారి తన అద్భుత ప్రతిభను ప్రదర్శించి బంగారు రజత పథకాలను సాధించింది. జింఖానా గ్రౌండ్ లో ఆదివారం జరిగిన ఆక్సిజన్ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ 20 25 పోటీల్లో బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న వీ శ్యామల సత్తా చాటారు. డిస్కస్ త్రో లో బంగారు పతకం షాట్ పుట్ పోటీల్లో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ ఐ ఎం ఏ ఏ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొండా విజయకుమార్, నూనె సురేందర్ పటేల్ ల చేతుల మీదుగా ఆమె పాతకాలను అందుకున్నారు ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ ఈ పథకాలు సాధించడం తనకెంతో ఆనందంగా ఉందని ఇదే స్ఫూర్తితో మరిన్ని ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
